STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

నీదేలే ప్రేమ !

నీదేలే ప్రేమ !

1 min
286


నీవేలే నే మనసుపడిన భామ .

నీదేలే అసలు సిసలైన ప్రేమ , ఓ రమా !

పిలువగనే చిలుకలా పలుకవా ,

కోరినది ఏదైనా కాదనకనే ఇవ్వవా !


నీది జాబిలిని మించిన అందము .

పొగుడుతూ రాస్తే నిమిషానికో కందము .

నీకు సరిజోడయ్యేలా నా డెందము ,

మధురమైనదోయ్ అలా విరిసే బంధము !


నీవి కలువరేకుల కళ్ళు .

గులాబీలు రంగులు సరిచూసుకునే చెక్కిళ్ళు .

నిను చూస్తే నాలో తీపి ఆకళ్ళు .

తీయవా నాకోసం నీ హృదయాంతర వాకిళ్ళు !


నీ రూపము ఒక అపురూప శిల్పము ,

మన ఊరి కొండంత చెప్పగా ఆ గొప్పగుణము .

బొమ్మలు వేయగా రోజుకో బల్పము ,

అక్షరాలనూ కూర్చి తీర్చుకోనా స్నేహఋణము .


నీ ఆనందము నాకు మిక్కిలి బలిమి .

నీవందించే ప్రేమ మహాసాగరమంత కలిమి .

మిన్నంటే ఆ మమతే ఎన్నటికీ మేలిమి .

ఒక్కటైతే మనదే అందరూ మెచ్చే చెలిమి !!



Rate this content
Log in

Similar telugu poem from Thriller