STORYMIRROR

స్వాతి సూర్యదేవర

Tragedy Others

4  

స్వాతి సూర్యదేవర

Tragedy Others

నీ మౌనం💔

నీ మౌనం💔

1 min
334

ఎందుకో.....

నీ మౌనం నా మనసుని దహిస్తుంది.....

నీ మౌనం నా మదిలో ఉన్న నీ రూపుని కరిగిస్తుంది....

నాతో పంచుకోలేని దాపరికమా...నా ప్రాణమా...

నీలో నాకు తెలియని భావాలు,భాధ ఏమున్నాయి అని ఒకవైపు... అసలు పంచుకొనేంత నమ్మకం నువ్వు ఇవ్వలేదా.. ...అని ఇంకోవైపు నా మెదడు పొరుపెడుతుంది....

ఇప్పటికే అలసిపోయాను నువ్వు ఇంకా దహించకు అని నా మనసు మెదడుని ఆర్థిస్తోంది....

ఆ రెండింటి పోరాటానికి అలసిపోతున్న...నిన్ను ఆర్థిస్తున్న...కానీ ఇప్పటికీ నీ మౌనం వీడనంటున్నావు......

ఇంతకీ తప్పు నీ మౌనంలో ఉందా...

లేక ఎరగక నీ మనసుని నొప్పించిన నాలో ఉందా....

అంతు తెలియని సంఘర్షణ లో నాలో నేను నలిగిపోతున్న....

నీకు తెలియదా....నీ మాట,నీ స్పర్శ లేకుండా నేను బ్రతకలేనని....

ఇకనైనా నీ మౌనం వీడి....

ఆఖరి క్షణాలకి చేరువవుతున్న నా ఆయువుకి ఊపిరి పోసి...నన్ను నీ గుండె గుటిలో దాచుకోని....

మన మధ్యన ప్రేమని మసకబారి పోయేలా చేసిన

చీకట్లు తొలిగేలా చిరుదివ్వేను వెలుగించవా.....ప్రియతమా...



Rate this content
Log in

Similar telugu poem from Tragedy