దీపం పురుగులు
దీపం పురుగులు


దీపపు పురుగులు...
చెదపురుగుల్లా ఎక్కడ పుడతారో తెలీదు...
అమ్మ పెంపకపు కుష్ఠువ్యాధి తనమో...
నాన్న వ్యభిచార సంపాదనా ఫలమో...
పూర్వీకుల అక్రమార్జనా మదగర్వమో...
చదువు చెబుతున్న పంతుళ్ళ
పైశాచికపు బోధనా పాండిత్య ప్రభావమో..
.
హీరోలుగా భ్రతుకుతున్నామనే భ్రమలో...
అభిమానుల మోజుల జోలేలలో విసర్జించిన ..
వెరైటీ ఫ్యాషన్ల ముష్టి ని పైచర్మంగా తగిలించుకుని
గొంగళీ ల్లా సమాజం లో పాకుతూ...
సినీ పైత్యాన్ని పసరు రక్తం గా మలచుకుని
ఊసరవెల్లి రంగుల మాటలతో...
ప్రతిభను అత్యాచారం చేసుకుంటూ...
వావి, వరుస, వయసు తారతమ్యాలను మరచి
తమ యోధానుయోధ రుధిరాన్ని నిర్వీర్యం చేసుకుని
‘ జీరో ‘లవుతున్న అర్ధబాగపు యువతకు...
మాడు పగిలి జీవనపరమార్ధం తెలుసుకుని
బ్రతుకును నిర్మించుకోవాలన్న తొలిమెట్టు..
.
కాలపుసమాధులకు పునాదిరాళ్ళవుతున్నప్పుడు
హద్దుమీరిన వాచాలత్వపు స్వరం ఆక్రోశించినా...
ఆలోచనను హత్య చేసిన ఆవేశం ఆర్తిగా వేడినా..
.
ఫలితం....
దీపంచుట్టూ తిరిగి తిరిగి జీవం పోయిన
శ...ల...భ...మే...!!!
***************************