నీ చావు నువ్వే....శ్రీనివాస భా
నీ చావు నువ్వే....శ్రీనివాస భా


అవును
మేఘాలు అడ్డు తొలగాయి
సూర్యుడి ప్రయాణం
మొక్కల సంతోషం
మనుషుల దుఖ్ఖ0 కోసం
స్వార్ధం ఒంటినిండా పూసుకుని
రకరకాల వేషాలేస్తున్నారు
ఎదురుగా ప్లాస్టిక్ భూతం
ఒళ్లువిరుచుకొని నవ్వుతోంది
నన్ను వాడకుండా మీరు బ్రతకలేరని
మనిషి
డబ్బును ప్రేమించి
ఆప్యాయతల్ని తగలెట్టేసి
అవసరాల నిచ్చెనమీద
ఆనందాల్ని కొనుక్కొంటున్నాడు
పావులా సోపునుండి
పదివేల పైనైనా
నేను లేకుండా మీకు రోజులేదని
చెట్లను చంపేసి
ఆక్సిజన్ అడుగుతారు మీరు
బళ్లు మీద బళ్లు కట్టి
పొగనంతా వదిలిపెట్టి
డాక్టర్ ముందు క్యూలు కట్టి
నర్సింగ్హోములకు టానిక్కులౌతారు
మేడ మీద మేడలు
దిగజారుతున్న విలువలు
నిత్యం పేపర్లలో కక్కుతున్న వార్తలు
నీ గొయ్యి నువ్వే తవ్వుకొంటున్నావ్ అనేలా
ప్రకృతి గుర్తు చేస్తోంది
వినాశనానికి ఇంకెంతో దూరంలేదని
సెకండ్ల భూమి... పరుగెత్తిస్తోంది
సముద్రం...రమ్మని కలిపేసుకొంటోంది
గాలీవాన వరదను ప్రేమించి
కంటికి కునుకు లేకుండా చేస్తోంది
ఇప్పుడు చెప్పండి
భగవంతుడిచ్చిన ప్రకృతిని బలిపెట్టి
సాధించుకున్నదేమిటో మరి.....
★★★★★★★©©©©©©©★★★★★★★★