STORYMIRROR

Lahari Mahendhar Goud

Inspirational

4  

Lahari Mahendhar Goud

Inspirational

నీ ఔన్నత్యానికినా నీరాజనాలు

నీ ఔన్నత్యానికినా నీరాజనాలు

1 min
796

ఒక ఇంటి యువరాణి 

మరొకరి ఇంటికి ఖచ్చితంగా పట్టపురాణి అవకున్నా

తన కళ్ళలోని భావాలను, చిరునవ్వుతో కప్పేస్తున్న

ఓ మహిళా నీ ఔన్నత్యానికి ఇవే నా నీరాజనాలు

పట్టపు రాణిని చేసి, పంజరంలో బంధించినా

తన మనసులోని బాధను, పెదవి గడప దాటనీయని

ఓ మహిళా నీ ఔన్నత్యానికి ఇవే నా నీరాజనాలు

బయట ఎంత పేరు ప్రఖ్యాతలు ఘడించినా

ఇంట్లో నువ్వు ఒక సాధారణ ఆడదానివే అని అనుక్షణం గుర్తుచేసినా

అన్నింటినీ పంటిబిగువున ఓర్చుకుంటున్న

ఓ మహిళా నీ ఔన్నత్యానికి ఇవే నా నీరాజనాలు

అన్ని బంధాలు నీవనుకునే నిన్ను

సమయం వచ్చినప్పుడు అందరూ ఒంటరిని చేసినా

ఏ బంధాన్ని తప్పుపట్టని మంచి మనసుకు

ఓ మహిళా నీ ఔన్నత్యానికి ఇవే నా నీరాజనాలు

ప్రపంచమే నీకు ఎర్ర తివాచీ పరిచినా

కుటుంబ కట్టుబాట్ల ముళ్ళ బాటలు దాటుకొని వెళ్ళి

నీ అస్తిత్వాన్ని చాటిచెప్పిన

ఓ మహిళా నీ ఔన్నత్యానికి ఇవే నా నీరాజనాలు

Rate this content
Log in

Similar telugu poem from Inspirational