STORYMIRROR

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

నిద్ర

నిద్ర

1 min
271

నిద్ర వలన హాయిగా ఉంటుంది, గొర్రె కసాయి కత్తి మీద తల పెట్టి నిద్రపోయినట్టు.

నిద్ర వలన హాయిగా ఉంటుంది, చేప కత్తిపీటపై పడుకున్నట్టు.


నిద్ర వలన హాయిగా ఉంటుంది, తల్లి ప్రక్కన పసిబిడ్డ పడుకుని ఉండగా కామాంథుడు తీసుకువెళ్ళినట్టు, కట్టెల మీద పడుకోబెట్టినట్టు.


గుహలో రాక్షసుడు రోజుకో మనిషిని తిని పడుకున్నట్టు, కాపాడే భీముడు లేని ఊరు పడుకున్నట్టు.


నిద్ర వలన హాయిగా ఉంటుంది, మత్తెక్కి, కక్కి, పడున్న మొగుడుని చుాస్తు , ఏడుస్తు పడుకున్నా ఇల్లాలిలా.


నిద్ర వలన హాయిగా ఉంటుంది, రోగంలో బాథపడుతు పడుకున్న నా దేశంలా,

సిగ్గు,ఎగ్గులేని నాకు నిద్ర వలన హాయిగా ఉంటుంది.



Rate this content
Log in

Similar telugu poem from Tragedy