STORYMIRROR

T. s.

Abstract Tragedy Others

3  

T. s.

Abstract Tragedy Others

నేనొక నిశ్శబ్ద నీరవం

నేనొక నిశ్శబ్ద నీరవం

1 min
5


నేనొక నిశ్శబ్ద నీరవం..

నా మనసు హిమవన్నగ శిఖరం

నేనొక కరిగిపోయిన స్వప్నం

నా జీవితం ఘణీభవించిన మంచు పుష్పం

నా శరీరం శిధిలమైన శిశిర పర్వతం

నాలో రేగే గాయం నిరంతరం జ్వలించే మంచు కెరటం

నా జీవనం బందనాల పంజరంలో

నడయాడే నరక ప్రవాహం

నా వాసం ఆరని ఆశల అవహేళనల వనంలో నిప్పుల కొలిమితో సావాసం

నేనొక నిశ్శబ్ద నీరవం

నేనొక నిశ్శబ్ద నీరవం..

నేనొక నిశ్శబ్ద నీరవాన్ని

కరిగిపోయిన స్వప్నాన్ని

నింగికెగరలేని అమవాస్యని

నిరంతరం నిప్పులా కాలే మిణుగురుని

కాలంలో కరిగిపోయే మేఘాన్ని

కనురెప్పల చాటున దాగిన కన్నీరుని

ఆవిరైపోయిన ఆశల తీరాన్ని

ఆటుపోటులతో ఎగిసే సముద్రాన్ని

అలిసిపోయిన అహాన్ని

విరిగిన రెక్కల విహంగాన్ని

అనంత లోకాలలో తిరిగే ఆవేదనని

చీకటి మాటున దాగిన కలాన్ని

నిశిధిన నిలిచిన

నిశ్శబ్దాన్ని

నేనొక నిశ్శబ్ద నీరవాన్ని..



Rate this content
Log in

Similar telugu poem from Abstract