STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Classics

4  

Dinakar Reddy

Abstract Drama Classics

నది చెప్పని కథలు ఎన్నో

నది చెప్పని కథలు ఎన్నో

1 min
486

కలలు మిగిలెను కన్నీళ్లుగా

వయసు కదిలెను వేగిరముగా

మరువక చేసిన పనే నేరమా

మరచిపోని ఆసక్తే దోషమా


ఆతిథ్యం వరమిచ్చింది

ఉత్సుకత గర్భం దాల్చేలా చేసింది

అడగనిదే సంతానం ప్రసాదంలా దొరికింది

నేను కాదని అన్నానే

కానీ దానికి సాక్ష్యం కావాలి కదూ

సమాజం ఏమంటుంది

ఈ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు


ఎక్కడ దాచేది ఈ పసి కూనను

ఎలా మరచిపోయేది ఈ పసినవ్వును

ఒక మంత్రం కన్న పేగు బాధ తెలిపింది

నన్ను క్షమించే మరో మంత్రం ఎక్కడ దొరుకుతుంది


ఒక్కసారి ఈ లేత పాదాన్ని ముద్దు పెట్టుకుంటాను

కడసారి నా గుండెకు హత్తుకుంటాను

అంతే

అంతకంటే ఇంకేం చేయగలను


కుంతి బాధను తనలో దాచుకుంది నది

నది చెప్పిన ఈ కథ ఆ కర్ణునుది

మరి చెప్పని కర్ణుల కథలు 

ఈ ఆర్యావర్తంలో ఎన్నో

వ్యాసుడు వ్రాయని భారతాలు ఇంకెన్నో



Rate this content
Log in

Similar telugu poem from Abstract