నాలో ఉన్న ప్రేమ
నాలో ఉన్న ప్రేమ
నీ మీద నా ప్రేమ
ఎంత అమితమంటే
ఆ ప్రేమని
ఎవ్వరి దగ్గరా
వ్యక్తపరచలేను
ఆ ప్రేమ చివరి అంచుకూడా
నీవరకూ రానివ్వలేను
కానీ
నాకు నీ గుండెల చప్పుడు తెలుసు
నీ మనసులోని భావనలు తెలుసు
నీ మీది ప్రేమని కోల్పోలేని
విహ్వల భావనలు
నన్ను సమూలంగా
దహించి వేస్తున్నాయి
నిన్ను పోగొట్టుకోకుండా
ఉండడానికి
నా ప్రేమని
నా మనసులోని
చీకటి కోణాల్లో
దాచేసి
బయటకు నవ్వులు
పూయిస్తున్నాను

