STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Tragedy Classics

🤗నా నవ్వుల రేరాజు💗

🤗నా నవ్వుల రేరాజు💗

1 min
283


ప్రియా !


నీ చూపులతో మనసులో 

మన్మధ బాణం వేస్తావు 

ముత్యాలు పోత పోసిన పలువరసతో 

వెన్నెల ఆరబోసినట్టు నువ్వు నవ్వితే 

ఆ నవ్వులో ఎన్ని అర్దాలు 

వెతుక్కుంటూ ఉంటానో ..


ఇలా నీ ఊహల్లో నాకు ..

కాలం కదలటం లేదు.. 

మనసు మౌనంగా రోదిస్తుంది. 

నీ రూపం కళ్ళముందు కదులుతుంది 

నీ శ్వాస వెచ్చగా తగులుతుంది .

అందమైన భావన నా నువ్వు 

మరపురాని స్మృతి నీ నవ్వు ..

నీకు - నాకు మధ్య దరిచేరలేని దూరం .

అయినా మనసు నీ వెంటే నీడలా వస్తుంది .


నిద్ర పోతున్నా నా గుండెల్లో నీ ఆలోచనల అలారం మోగుతూనే ఉంటుంది .

నా భావాలు నీకు చెప్పినంత మాత్రాన నాకు సంతృప్తి లేదు.వాటికి నువ్వు ఊపిరి పోసి ఆయువు ఇస్తేనే కదా 

నా ప్రేమకు మనుగడ .


ఎందుకు నన్ను 

నీ ప్రేమ పంజరంలో బందీని చేసావు 

నీ ఆలోచనల అలల్లో మునిగేలా చేసావు 

నీ జ్ఞాపకాల వెన్నెల్లో తడిసేలా చేసావు 

నీ ఊహల ఊయలలో పాపాయిని చేసావు. 

నీ విరహపువేదనలో ఒంటరిని చేసావు 

నాలో నేనే లేకుండా 

నన్ను నాకే కాకుండా చేసావు.


నా మనసు నీ వెంటే నీడలా పయనిస్తుంది 

వద్దన్నా నా హృదయం

అర్ధం కాని నీ నవ్వుల్లో చిక్కుకొని తపిస్తుంది .


శ్రీ ...

హృదయ స్పందన ..



Rate this content
Log in

Similar telugu poem from Tragedy