మరణ శాసనం
మరణ శాసనం
క్షణ క్షణం భయం గుప్పెట్లో...
కరోనా కనుసైగలలో మన జీవితాలు
నడిసంద్రంలో బిక్కుబిక్కమంటున్న బ్రతుకులు
కరోనా తీరం కానరావడం లేదు
ఈ బాటసారులు బ్రతుకుల భారం తీరేదెప్పటికో!
మసకబారిన జీవితాలలో చిరు దీపం వెలిగేది ఎప్పటికో!
మహమ్మారి కోరలలో చిక్కుకుని వివిలలాడుతున్న జీవితాలకు విముక్తి ఏనాటికో!
కళకళలాడే కాపురాలలో కలకలం రేపుతున్న కరోనాకి కనికరమే లేదా!
కనికట్టుగా బలి అయిపోతున్న ప్రాణాలు
ఆవిరి అయిపోతున్న ఆశలు
నిరాశావాదమే ఊపిరిగా మిగిలిన బ్రతుకులు!
సమాధులవుతున్న జీవితాలకు సమాధానం ఏది?
అహర్నిశలు శ్రమించిన శ్వేత దూతల శ్రమని
నిర్వీర్యం చేసి మన గాన గంధర్వుడుని బలి తీసుకున్న రక్కసి
శ్వాస లో చేరి శ్వాసనే శాసిస్తున్న ఓ మరణ శాసనమా!
మాకు ఈ శాప విమోచనము ఎప్పటికి?
