మొదటి సాహితీ... విత్తే సత్తువ
మొదటి సాహితీ... విత్తే సత్తువ


అది ఒక అనుభవం
గురువులు మెచ్చిన రోజు
గురుతులు మిగిల్చిన రోజు
మొదటి రచన ముద్రితమై
పలువురుకీ నచ్చిన రోజు
భుజం తట్టి మెచ్చుకున్న
మిత్రులు నాకు ప్రోత్సహిస్తే
కలం పట్టి రాయమంది మది
ఎద లోతుల్లో ఊహలు పుట్టి
మొక్కై మోడువారిన మెదడుని
చిగురింప జేసిన రోజు
లెక్కలేనన్ని కథలకు
మొదటి కథే విత్తు సత్తువ
వేలాది రచనలు జాలువారి
అనంతమైన సాహితీ జగతిలో
నాకూ ఒక చిన్న స్థానానికి
పునాధి రాయిగా నిలిచిన రోజు
గుర్తుకొస్తుంది హోమియో డాక్టర్
మెచ్చి నాకు నా రచన పత్రిక తెచ్చి
ఇచ్చి అభినందనలు తెలిపి
ముందుకు సాగిపో... ఆగిపోకు అని
నాకు మెలుకవలు చెప్పి గొప్ప
నిబ్బరాన్ని నిర్ణయాన్ని ఇచ్చిన రోజు
మొదటి రచన... మొదటి చూపు
మొదటి ప్రసంశ... మొదటి గొప్ప
మొదటి పత్రిక... మొదటి మిత్రుడు
మొదటి ముద్రిత అక్షరం...జ్ఞాపిక
మొదటి సాహితీ అడుగు...
నేటి మహా ప్రస్తానంలో నిరంతర
జీవనాడి... సాహితీ విత్తు