STORYMIRROR

ARJUNAIAH NARRA

Abstract Inspirational

3  

ARJUNAIAH NARRA

Abstract Inspirational

మనసున్నమహానుభావులు

మనసున్నమహానుభావులు

1 min
384

చుట్టూ కటిక దారిద్య్రం

వెనువెంటే అవమానం

ప్రోత్సాహం, ప్రోద్బలం లేదు

అణగదొక్కేటందుకు మరెందరో

అంబెడ్కర్ జీవితపు ఎడారిలో

ఒయాసిస్సులా కొందరు 


అంబావదేకర్ ఇంటిపేరును అంబెడ్కర్ గా 

స్కూలు రికార్డులందు నామకరణం చేసి  

పేరుతో ఉండే కుల రక్కసి చెర నుండి రక్షించినది 

ఒక ఉపాధ్యాయ మహానుభావుడు!


కళాశాల చదువుల ఖర్చులకు సహాయం కోరగా 

కేలుస్కర్ అర్ధించేను అంబెడ్కర్ కోసం

శాయాజి రావు గాయక్వాడ్ ని

అంబెడ్కర్ చిత్తశుద్ధిని మెచ్చి

జ్ఞాన పిపాసను నచ్చి 

నెల నెలా పాతిక రూపాయల 

ఉపకార వేతనమ్మును ఇచ్ఛే 

మనసున్న మహారాజు


కొల్లపూర్ సాహు మహారాజు 

కొలువు నందు కొలువుదీరే ఎందరో నిమ్నజాతియులు

పట్టపుటెనుగును తోలే మావాటి మావాడే

మరాఠీ రాజు సానుభూతిపరుడు

పీడిత వర్గాలతో సహపంక్తి భోజన దారుడు

మూఖ్ నాయక్ పత్రిక స్థాపనకు ముఖ్యుడు

మానవతావాదీ, మహానుభావులు


వీదేశాలలో చదువులు 

బరోడా మహారాజు పుణ్యమే

తిరిగి వచ్చిన అంబేడ్కర్ కి

బరోడా సంస్థ బరోస నివ్వలే

పార్శి వారి కరుణ పది గంటలే


బరోడా మహారాజు ఆదర్శలాను ఉల్లంఘించి

అస్పృశుడు పనిచెయ్యవద్దంటు 

నడిచే గ్రంధాలయం నడిచి వస్తుంటే

నాలుగు వర్ణాలు నేలమీద పరిచిన తీవాచిలు 

వచ్చి పోయే ముందు ఎత్తి వేయడం

ఫైళ్లు చేతికందిస్తే మైలంటు బల్లపైకి విసరడం

ఇఛ్చిన ఉపకార వేతనం ఇవ్వాలని

ఒత్తిడి చేసి మిలటరీ కార్యదర్శి పదవికి

రాజీనామా చేపించిరి...


అమెరికాలో అత్యున్నత స్థితికి

స్వదేశంలో హైన్య స్థితికి సిగ్గుపడి

స్టాక్స్ షేర్ల డీలర్లకు సలహాలిస్తుంటే

దలితాజాతి సలహాలు వినరాదని

ఇబ్బందులకు గురిచేస్తే చివరిగా 

సిడెన్ హోం కళాశాలలో 

పొలిటికల్ ఎకానమీ ఫ్రొఫెసర్ గా బోధించెను

విద్యార్థుల ఉదాసీనత వైఖరి

అధ్యాపకుల ఆంక్షలు ఒకటి మీద ఒకటే

సమ్మెటపొట్లతో వజ్రసంకల్పుడైయ్యే


పంచములు, అంత్యజులు, ఆవర్ణులు,

అతి శూద్రులు, హరిజనులు అంటరాని కూలల

హితుడుగా, తాత్వికుడుగా, మార్గదర్శిగా, 

అణచబడ్డ జాతుల ఆశజ్యోతిగా

అణగారిన ప్రజల గుండెల్లో అమరుడు 

బ్రహ్మ తల రాత మమ్ములను 

అస్పృస్యులగా మారిస్తే

తన రాతలతో మా కర్మ రాతలను మార్చిన 

మరో సృష్టికర్త....మా రక్షకుడు...మా దేవుడు....

మా అంబెడ్కర్...


 



Rate this content
Log in

Similar telugu poem from Abstract