STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Fantasy Inspirational

3  

Thorlapati Raju(రాజ్)

Tragedy Fantasy Inspirational

మనసుకి ముసుగేసి!

మనసుకి ముసుగేసి!

1 min
252

రూపంతో...ఎందరో మగువల మనసుల్లో

రసిక రాగాలను పలికించిన.. రాజేష్ ఖన్నా!

అంద చందాభినయాలతో

దేశాన్నే ఏలిన... శ్రీదేవి!

నిండు చందమామంటి ముఖవర్చస్సు తో

కంతామణుల కలల రాకుమారుడు...

రిషి కపూర్ !

సహజ నటనతో అందరి మనసులు

చోరగొన్న.. ఇర్ఫాన్ ఖాన్!


ఇలాంటి వారెందరో..

రూపానికి రంగు 

మనసుకి ముసుగు వేసి..

మనల్ని రంజింప జేసి..

చివరకు చితిని కౌగిలించారు!


వీరు చేరని ఎత్తులు వుండకపోవచ్చు..

చూడని ఉన్నతి వుండకపోవచ్చు..

ఊహించని మలుపులు 

తేరుకొని ఎదురు దెబ్బలు..

కూడా వుండవచ్చు!

కాని!

వారి ఆత్మస్థైర్యం..

ఎప్పుడూ దెబ్బ తినలేదు!


ఫ్లాప్ లెన్ని వచ్చినా..

తిరిగి హిట్ పొందాలనే..

పడి..పడి..పడిన ప్రతిసారీ..

తిరిగి పరిగెత్తాలనే..

వీరి పట్టుదల..పోరాట పటిమ..

నిజంగా అమోఘం!


మరి!

మనలో ఎంతమంది పోరాడుతున్నాం!


ఎంతో మంది..

జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు..

వంగి వంగి.. కృంగి పోయి..

వగచి వగచి.. వేదనచెంది..

మన బాధకు..

వెరోకర్ని బాధ్యత గా చూపించి...

పరనిందతోనే..పరమాత్ముడిని..తలచుకుంటూ


నాకు.. నాకు మాత్రమే..

ఇంతటి అత్యంత 

దయనీయ దుస్థితి దాపురించింది అంటూ..

వెక్కి వెక్కి ఏడ్చుకునే విరక్తి జీవులెందరో!


కాని!

విజేతలకైన..పరాజితులుకైన..

ఆస్తి పరులకైన..అనాధలకైనా..

రక్తులకైనా..విరక్తులకైనా..


పుట్టుక ఒక్కటే..చావు ఒక్కటే!


అందుకే..

జీవితం..ఏమిచ్చినా..ఎలా ఇచ్చినా

స్వాగతించు.. ఆస్వాదించు!


జరిగిపోయిన..పుట్టుక!

జరగబోయే..చావు!

కాదు..

జరుగుతున్న.. ప్రస్తుతాన్ని..

ప్రయాణాన్ని.. ఆస్వాదించు..


తీపైనా.. చేదైనా..

ఆస్వాదించగలిగితే.. హాయి హాయిగా..

మనతో ఉండేదంతా..హాయేగా!


         ...... రాజ్......



Rate this content
Log in

Similar telugu poem from Tragedy