మనదేశం
మనదేశం
నాదేశం నీదేశం కాదిది మనదేశం
మనం,ధనం,తరువాతే జనం
స్వాతంత్రం భ్రమలోనే బ్రతుకుతున్న బానిసలం.
హక్కుదారులం హైటెక్కు వీరులం
తెలివిగల వారమనే మందబుద్ధి కలవారం.
కూడు వద్దు గుడ్డ వద్దు కులం పేరుతో బ్రతికేస్తాం.
చావనైన చస్తాం, మా కులం కోసం చస్తాం.
చదువులేదు సంధ్య లేదు ప్రాంతాలే పాలిస్తాం.
దిక్కు లేదు మాకు తిరిగి వాళ్ళనే గెలిపిస్తాం.
దమ్ముధైర్యం ఉంది రోషం పౌరుషముంది
ఆడాళ్ల మీద వాటిని చూపేటందుకే.
పచ్చనోటు చాలు ,పట్టుచీర చాలు
పచ్చని దేశాన్ని పాలించచ్చు అనుకునే పిచ్చిమారాజులం.
తెల్లదొరను తరిమిగొట్టి,నల్లదొరకు కట్టబెట్టి
పొగరు తోటి తొడగొట్టిన తోలుబొమ్మలం.
రాజ్యాంగం పాటించే రాజకుటుంబీకులం
ఉన్నత విధ్యలు చదివిన పామరులం.
బంధుత్వం కాదు మాది మంధుత్వం.
తరాలు మారినా చెరగని అమాయకత్వం.