మంచి చెడుల మధ్య..
మంచి చెడుల మధ్య..


ఆనంద డోలికల్లో
ఆపన్నుల గురించి ఆలోచనా
అనుకోని వేళల
అత్యాశ బరువెక్కెనా
విచక్షణ లేక
విలువను తొక్కెనా
తీతువు కూతల వేటలో
ధర్మ సందేహాలు
సాగర మథనంలో
సవాలక్ష హాలాహలాలు
ఏ ఆయుధం మార్చేది
అక్షరమా
తోలు వలిచే పరికరమా
పోటీగా పోటు పొడిచే గునపమా
మాట కంటే వాడిగా తగిలే బాణమా
వివేకంతో ప్రవర్తిస్తే
మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోగలిగితే
ఇక యుద్ధం లేదు
తుపాకీ గుళ్ళ చప్పుళ్ళు లేవు
మనసుల మధ్య కట్టే గోడలు లేవు
అరాచక ఆయుధ సంపత్తి వదలి
మానవత్వం వైపు తిరిగి
మనం అడుగులు వేయగలమా
తొలి అడుగు ఎవరు వేస్తారని
చర్చల్లో మిగిలిపోదామా
మరో తీరాన్ని వెలివేద్దామా..