STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

మన సంస్కృతి

మన సంస్కృతి

1 min
1.2K

ఎటు వైపు పయనిస్తున్నది మన సంస్కృతి ?

జన్మదిన వేడుక పేరున జరుగుతున్న

విపరీత ధోరణికి భాష్యమేమి ?

కేకు కత్తిరించినా..సంతృప్తి చెందని ఆశ...

కమ్మగా ఆరగించే కేకులు...వికృత చేష్టలతో...

వదనానికి పూసుకునే క్రీములయ్యాయి.

హానికర రసాయనాల స్ప్రేల తో ఆహ్లాదకర వాతావరణం విషతుల్యమవుతున్నది

జ్యోతి ని వెలిగించడముతో ప్రారంభం అయ్యే మన సంస్కృతి

కొవ్వొత్తిని ఆర్పి వేడుక జరుపు కునే దిశగా పురోగమించింది

సెల్ఫీల మోజు విలయతాండవం చేస్తున్నది

విస్తరాకుల స్థానాన్ని ఆక్రమించుకుని

పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ప్లాస్టిక్ రారాజుని

చూసి విస్తుపోయిన మన సంస్కృతి

ఒక ప్రక్క బక్క చిక్కిన డొక్కలతో అన్నమో రామచంద్ర!

అని అలమటిస్తూ వినిపిస్తున్న ఆర్తనాదాలు

మరో ప్రక్క వేడుక పేరుతో వ్యర్ధమవుతూ

చెత్త బుట్టల వశమవుతున్న ఆహారం

ఈ సంస్కృతి రుచించని కొన్ని వదనాలు బిత్తర చూపులతో

ఒక మూలన నక్కి నక్కి చూస్తున్నాయి

పులోహోర, పాయసాల వేడుకలు అంతరించి

కేకు,శీతల పానీయాల సంస్కృతి ఆవిర్భవించి

పులుముకునే ,పూసుకునే వింత చర్యలతో

పయనిస్తున్న నేటి మన భారతావని

కొత్తదనపు హంగుల ఊబిలో కూరుకుపోతూ

అందించే హస్తము అందుబాటులో లేక

ఊపిరాడక మునిగిపోతున్న మన దేశ సంస్కృతిని

జాగృతీ కృతం చేద్దాము కదలి రండి


 


 


 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational