STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

మన బాధ్యత

మన బాధ్యత

1 min
304

సద్గుణమనే బీజం నాటాలి చిన్ననాడే,

వృద్ధి నొందినది ఫలాలను ఇచ్చునపుడే.

తల్లిదండ్రులే ఆదిగురువులు పిల్లలకు,

వృద్ధి నొందెదరు వారు గురువుల బోధలకు.

నాడు ఇంటిపెద్దలు బోధించిరి మంచిచెడులు,

నేర్పిరి తలిదండ్రులు, గురువులు మంచి నడతలు.

సాంకేతికత పెరిగిన నేటి కాలాన నేర్పేదెవరు!

సమయము వెచ్చించి పెద్దల సుద్దులు వినేదెవరు?

కానీ పిల్లలు మట్టిముద్దలవంటి మనసున్నవారు,

లేలేత మొక్కలవలె పెంచిన తీరున పెరుగుతారు.

కళాకృతులుగా మట్టిముద్దలను తీర్చాల్సింది మనం,

సరైన రీతిన మొక్కలను పెంచాల్సిందీ మనం.

సరైన రీతిన పెరగరని, మాటవినరని ఎలా అనగలం!

చెప్పే రీతిన చెప్పి, సరైన తీరున పెంచామా మనం!!

కావాలి మనకు చిన్నకుటుంబం చింతలేని కుటుంబం,

పెద్దవారు అడ్డు, అక్కర్లేదు మాకు ఉమ్మడికుటుంబం.

అమ్మానాన్నలకు తీరిక, ఓపిక లేదు ఉద్యోగాలతో,

తీర్చేదెవరు, పిల్లల సమస్యలు, ఉండేదెవరు వారితో!

తల్లిదండ్రులు, గురువులే బోధించాలి మంచి చెడులు,

పరిచయం చేయాలి మహాపురుషుల జీవిత గాథలు,

చేయాలి నీతిబోథలు, నేర్పాలి సరైన నడవడికలు.

మన కృషితోనే కాగలదు స్వర్ణమయం పిల్లల భవిత

చాటిచెప్పగలం మన స్వర్ణ భారత దేశ భవ్య చరిత.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational