STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

మలి వయసు ముచ్చట

మలి వయసు ముచ్చట

1 min
183

ఎన్ని వసంతాలు చూసుంటాం

అందులో నాకు నచ్చినవి

నిన్ను కలిసాక మొదలయ్యాయి


ఎన్ని శ్రావణాలు ఉపవాసాలు చేసుంటావు

నిన్ను కట్టుకునేందుకు ఆ మాత్రం చెయ్యాలి కదా


ఎన్ని గొడవలు పడుంటాం

అయినా భార్యా భర్తలన్నాక గొడవలు మామూలే కదా

ఇలా అన్నిటికీ సమాధానం చెప్పగలవు

నన్ను ఆనందంలో ముంచేయగలవు


ఎన్ని సర్దుబాట్లు జరుపుకునుంటాం

ఎన్నైనా మన కోసం మన పిల్లల కోసమే కదా

పెరగని ఆదాయాలు పెరిగే ఖర్చులు

పనుల భారాలు చెప్పలేని సమస్యలు

ఎన్నిసార్లు టీవీ రిమోట్ కోసం పోట్లాడుకున్నాం

మరెన్ని సార్లు ఒకరికిష్టమైన ప్రోగ్రాం మరొకరం గుర్తు చేసుకోలేదు

వయసు పెరిగే కొద్దీ ప్రేమ తగ్గదు

ఇంకా పెరుగుతుంది

నిజం కాదంటావా

మలి వయసు ముచ్చట్లలో

మనం భార్యా భర్తల్ని కాదు

వాళ్ళలో ఆజీవ స్నేహ బంధాన్ని చూస్తాం 

మరోసారి మనం దగ్గరవుదాం

స్నేహితుల్లా

ఒకరి కోసం ఒకరుగా

చూడచక్కని జంటలా

#SMboss contest


Rate this content
Log in

Similar telugu poem from Abstract