మీకు_తారస_పడింది_నేనే
మీకు_తారస_పడింది_నేనే


“ #మీకు_తారస_పడింది_నేనే”
మీ పిల్లలు వదిలి పెట్టిన బట్టలు కట్టుకుంటూ
మీ ఇంటి మగపిల్లల కామపూరిత చూపులను తప్పించుకుంటూ
పట్టెడన్నం కోసమై మీ ఇంట పాచి పనులుచేస్తూ
పాలిపోయిన మొహంతో “మీకు తారస పడింది నేనే”
గుడి మెట్లపై ఎండలో కూర్చొని
కాళ్ళు మండుతున్నా లెక్కచేయక
కడుపుమంట తీర్చుకునేందుకు
చిల్లర డబ్బులు అడుగుతూ “మీకు తారస పడింది నేనే”
పిండంగా ఉన్న నేను ఆడపిల్ల అయినందుకు
చేత్తకుప్పలోనో ,మురికి గుంటలోనో
జీవంగానో నిర్జీవంగానో “మీకు తారసపడిం
ది నేనే”
మానసిక పరిపక్వత లోపంతో
మనువాడిన మగడే అనుమానంతో నిందలేస్తుంటే
అవమాన భారంతో క్రుంగిపోతూ “మీకు తారసపడింది నేనే”
కామ పిశాచి చూపుల్లో చిక్కుకొని
కర్కశమైన కబంద హస్తాల్లో బందీలుగా మారి
విలవిలలాడుచు మానభంగానికి గురై అవమాన భారంతో
ఉరి తాడుకి వేలాడుతూనో ,రైలు పట్టాల పైనో పడి “మీకు తారసపడింది నేనే”
అడుగడుగునా ఎదురైన అగచాట్లను ఎదుర్కొంటూ
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా “మీకు తారసపడింది నేనే(ఆడపిల్లనే)”
........................................................................