మది దాగిన మాటలు
మది దాగిన మాటలు
చెలి కళ్ళను చూసినప్పుడు
ఆమె వెంట నడిచినప్పుడు
ఎన్నో మాటలు దాగాయి
సూర్యోదయం చిరు చెమటను నుదిటిపైన
అలంకరించినప్పుడు
గ్రీష్మంలో వాన చినుకులు ముద్దాడినప్పుడు
ఎన్నో మాటలు దాగాయి
మొదటిసారి తల దువ్వుతూ తెల్ల వెంట్రుకలు చూసుకున్నప్పుడు
పెళ్ళి చూపుల్లో అమ్మాయి నచ్చినప్పుడు
కళ్ళద్దాలకు ఏసీ గాలి మబ్బులు కట్టినప్పుడు
కాలి పగుళ్లను దాచడానికి ప్రయత్నించినప్పుడు
జీతం ఎందుకు సరిపోదని లెక్క చెప్పలేనప్ప్పుడు
లెక్కల పరీక్షలో తప్పినప్పుడు
మది దాగిన మాటలు ఎన్నో
అసలు నిలుపు లేకుండా వచ్చే ఆలోచనలకు కళ్లెం వేయాలని నేను చేసిన ప్రయత్నాలు ఇంకెన్నో

