STORYMIRROR

Midhun babu

Inspirational Others

4  

Midhun babu

Inspirational Others

మబ్బుల పయనం ఎటో

మబ్బుల పయనం ఎటో

1 min
251

పొద్దున్నే లేచి ఆకాశం వంకఓసారి తలెత్తి చూసా..ఏదో పెళ్ళికో..పేరంటానికోఏ చోద్యం చూడటానికో హడావిడి పడుతూ వెళ్ళే జనాలలా...మబ్బులన్ని ఎక్కడికో పయనమైపోతున్నాయిబారులుగట్టి పరుగులెడుతున్నాయిఏదో కంగారుపడుతూ న్నట్లు

తొలకరి జల్లు కురిపించడానికో.. ఏ మేఘసందేశమో మోసుకుపోయి అందించడానికో..

సూరీడి భగభగలకుఉడికిపోయిన ప్రకృతికి... జీవకోటికిఓదార్పుగఆవిరులను ఒడిసిపట్టుకుని ...ఓపలేని తాపంతోతాము చల్లబడి ... ప్రకృతి తాపాన్ని తీర్చడానికో...దూదిపింజల్లా ఉన్న మొగుళ్ళుకారునలుపెక్కుతూ ఎక్కడికో తరలిపోతున్నాయి

మేఘమాలలు నింగినంతా అల్లుకుంటుంటే..పొద్దెక్కినా.. సూరీడు ముఖం చాటేయడంతోచీకటి ముసురుకుంటోంది 

చల్లని గాలులు..నత్తపరుగులవలె వీస్తూంటే మబ్బులొకటొకటి కలిసిపోతూ పెద్దగా కొండల్లా మారుతున్నాయి

ఆ మబ్బుల గుంపుల పరుగులు ఏ కొండలకో.. అడవులకోఏ ఏటి చెంతకో..ఏ సెలయేరు దరికోఏ భూముల దాహార్తిని తీర్చడానికోఏ పొలాల దగ్గరకో..ఏ రైతుమోములోచిరునవ్వు మొలకలను మురిపించడానికో...పరుగులెడుతున్నాయి

చెట్లకొమ్మలు వింజామరలు విసరినట్లు .. చల్లనిగాలులు వీస్తున్నాయిమేఘాలు నడకలాపినెమ్మదించి చల్లబడ్డాయేమో...నిలిచి నేలవంక చూస్తూ...తొలకరి జల్లు కురిపించిమురిపించడానికిసిద్దంగా ఉన్నాయేమోతలెత్తుకుని చూస్తున్ననా నుదుటిపైఓ పెద్ద చినుకు..విసురునొచ్చి గట్టిగా తాకిందిటప్పుమని శబ్దం చేస్తూ..చిరుచినుకుల్లా అల్లంత దూరం ఎగిసి పడింది

ఆ చినుకు స్పర్శతోమేను పరవశించి...ఒక్కసారిగా జలదరించింది....

చిరుచినుకులు తాకిడి చిటపటలుఎక్కువైజడివానగా మారుతోందిఓర్చుకోలేని తనువూ..మనస్సూఇంట్లోకి వెళదామని త్వరపెడుతూంటే...అయిష్టంగానేకాళ్ళు ఇంట్లోకి నడిచాయి

         -


Rate this content
Log in

Similar telugu poem from Inspirational