STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

కాలం చెల్లిన మాట

కాలం చెల్లిన మాట

1 min
1


మాటే మంత్రంగా భావించి జీవితాలు సాగిన కాలం కాదిది.. 
ఔను ధనమే దైవంలా చెలామణి అవుతున్న కలియుగంలో..
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం లేదెవ్వరూ..
కాలం చెల్లిన మాటకు విలువ ఇవ్వడమే మానేసింది లోకం..
అవసరాలకు ఆకాశం నుండి భువికి మలయ మారుతంలా..
అబద్దం ప్రేమలు కురిపించే కాలకూట నవ్వులతో.. 
పైపైన మేడిపండు మెరుగులు దిద్దిన 
కృత్రిమ రంగులతో.. 
నటనల హంగులతో సరికొత్త మాయా ప్రపంచం తయారైంది..
స్టాంప్ పేపర్లు దస్తావేజులు కూడా ఋజువులుగా నిలబడని..
దందాలతో చెలరేగే సిగ్గులేని కంత్రీగాళ్ళు నిండిన..
దౌర్భాగ్యపు విశృంఖలతా జగంలో బతుకుతున్న దైన్యం..
సామాన్యుల గోడు వినే రాజులు పోయి.. 
దొంగ సాక్షం చెప్పే కరెన్సీ తేనె పూసిన
మాటలకు..
న్యాయం జరుగుతున్న తరాజులు ఆడిస్తున్న జగన్నాటకం ముందు..
కళ్ళుండీ కబోదిలా చెవులుండీ బధిరుడిలా నోరుండీ మూగవాడిలా.. 
బతికున్న జీవశ్చవంలా బతుకు వెళ్ళమారుస్తున్న వెర్రిజనం.. 
వస్తుందేమో మాటకు విలువిచ్చిన రామరాజ్యం అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు..!


Rate this content
Log in

Similar telugu poem from Classics