కనులు
కనులు
కనులు విప్పకుండ నిన్ను..వింటూనే ఉండిపోదు..!
నీ మౌనపు మాధురిలో..మైమరపై వెలిగిపోదు..!
భావాలను శాసించే..పలుకులతో పనేంలేదు..
నీ చూపుల వానపాట..పాడుటలో మునిగిపోదు..!
ఈ మాయా వీణలోని..రాగాలకు తంత్రులేవొ..
పల్లవించు స్వరధారల..కంటకనే కరిగిపోదు..!
నావియనగ ఉన్నవేమి..తనువు నాది కానప్పుడు..
విర్రవీగు మనసువేయు..వేషాలను తుడిపిపోదు..!
ఎలా పడితె అలా వ్రాసి..గజలేనను భ్రమేమిటో..
కిరీటాల ఊబిలోన..దిగిపోతూ మురిసిపోదు..!
ఎవ్వరేమి వ్రాస్తారో..నేనెందుకు చదవాలట..
నా రాతలు లైకితేనె..వారిరాత లైకిపోదు..!
