రంగులెరుగని పోద్దు
రంగులెరుగని పోద్దు
చిమ్మ చీకటి వీడి వీడక ముందే
నారింజ కెంజాయి రంగులతో
తొలిపొద్దు సూరీడి అందాలు
అవి మనసును చిందే వర్ణాలు -
ఆ తొలి కిరణాల వయ్యారాలు
అవనిపై చిందే అద్భుత దృశ్యాలు
తొలి మలి సంధ్యల అందాలు
మనసున పలికే బంధాలు
తూరుపు తెలతెల వారక ముందే
అరుణోదయ కాంతులు విరజిమ్ముతూ
సింధూరపు వర్ణాలతో అలరిస్తూ చీకట్లను,
ఇక్కట్లను తరుముతూ నవ్య క్రాంతితో
జీవులను మేల్కొలుపుతూ,
అద్భుత అందాలతో యామార్చుతూ
సృష్టి అంతటి అపురూప
సౌందర్యాన్ని ప్రసాదిస్తుంటే
మనిషి ఏ రంగూలేని ఏకాకిగా
మారుతున్నాడు
సీతాకోకచిలుక వోలె రంగుహంగులతో
ఉండాల్సిన మనిషి ,
చిత్రకారుని కుంచెలా సప్త వర్ణాలు
సోయగంతో నింపాల్సిన జీవితం,
నిర్జీవంగా ఉదారంగులా ఉదాసీనంగా
నిస్సారమై రంగులెరుగని పొద్దులా మారింద
