STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మది మదిలో

మది మదిలో

1 min
2


తెలవారే లోగా'నే..మత్తులన్ని వదలాలోయ్..!
ఒళ్ళొంచే దీక్ష సరిగ..మదిమదిలో వెలగాలోయ్..!

ఎదురుచూచు సందడులకు..సెలవిస్తే మంచిదిలే..
సుప్రభాత గీతంతో..అవసరమే తీరాలోయ్..!

నిజ చక్కని ప్రేమగగనమై..ఉన్నది నీ హృదియే..
భావనలకు అతీతముగ..విశ్వానికి పరచాలోయ్..!

చనిపోయే వారు లేరు..పడిపోవును మనసే..
ఆపేక్షలు రాలు విద్య..నేర్చుకోగ ఎదగాలోయ్..!

మొలకెత్తే కోర్కెలింట..సిగ్గుపూల జాతరలే..
వలపువీణ సంగతులే.. ఎఱుకలోన కరగాలోయ్..!

పలు రంగుల పుట్టినిల్లు..ఊరిస్తూ ఉండునులే..
నిత్యదీప వెలుగుసాక్షి..అడుగులెల్ల కదలాలోయ్..!



Rate this content
Log in

Similar telugu poem from Classics