STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

మానవేల

మానవేల

1 min
4


ప్రశంసించు పనికన్నా..పనేం లేదు చేయవేల..!?
నచ్చకున్న విమర్శించు..పనిమాత్రం మానవేల..!?

అవగాహన మించి లేదు..ప్రకటమయే దేదైనా..
నిను లోలో చూసుకోగ..లోలోపల నిలువవేల..!?

భావగగన వీధులలో..యాతనేమి పడతావోయ్..
మాటలతో పనే లేని..లోకంలో ఆగవేల..!?

ఎవ్వరికో నేర్పేందుకు..ఆరాటం ఎందుకంట..
బ్రహ్మవిద్య ఏమిలేదు..రహస్యమిదె పట్టవేల..!?

నీతులన్ని గోతులుగా..అనిపించును వినేవేళ..
జ్ఞానమిచ్చు గురువంటే..అనుభవమే చదవవేల..!?

మౌనపు రుచి మరిగినంత..మధువేదీ కోరలేవు..
నీ దైవం నీలోనే..కణకణమున కాంచవేల.


Rate this content
Log in

Similar telugu poem from Classics