STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy Action Fantasy

4  

ARJUNAIAH NARRA

Tragedy Action Fantasy

మాయని మచ్చ

మాయని మచ్చ

1 min
364


పొద్దునే లేచాను

అద్ధంలో నా ముఖం చూసుకున్నాను

ఎదో కొత్త మచ్చ కొత్తగా పుట్టుకొస్తున్నది

ఎట్లయినా తొలగించుకోవాలని.....


తుడిచాను, సబ్బుతో కడిగాను 

ముఖానికి పౌడర్ పూశాను

కనపడదులే అన్న ఆశతో 

 

మధ్యాహ్నం ముఖం కడిగాను

మరక మార్కు కనపడింది

ఈ సారి నల్ల రంగు పులిమాను

నా రంగులో కలుస్తది లే అన్న నమ్మకంతో


సాయంత్రం మళ్ళీ కడిగాను

దాని మచ్చ పోలేదు

ఈ సారి రెజర్ బ్లేడుతో గాట్లు పెట్టాను

పోతదిలే అనుకున్న, అయిన అది పోలేదు 

ఇపుడు నా ముఖం అందవికారంమైనది 


ఇంతవరకు.....

నా వంటి మీద పుట్టుమచ్చ లేదు

నా జీవితంలో అసలు మచ్చే లేదు

ఇది పెట్టుడు మచ్చ అవ్వుద్ధని, 

శాశ్వతంగా ఉండుద్దని

సమాజం నవ్వుద్ధని

తోలును తొలిచాను, 

మచ్చను  వలిచాను


కానీ...మళ్ళీ ఉదయం నా మొహం మీద

ఈ మచ్చ  ఉదయించడం చూసాను

ఎందుకో తెలియదు కానీ  ......

ఈ భూమి మీద మచ్చ లేని మనిషి

లేకపోవచ్చు అని అనిపిస్తుంది....

        ************

సుదూరం నుండి సమీరం 

సీని గీతాన్ని లీలగా మోసుకొచ్చింది


ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక



Rate this content
Log in

Similar telugu poem from Tragedy