STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

మాస్క్ తో తిప్పలు

మాస్క్ తో తిప్పలు

1 min
324

జగమంత కుటుంబం నాదేనంటూ

నిత్యం విస్తరిస్తూ విహరిస్తూ

తన ఉనికిని ఉధృతంగా చాటుతూ

ఇందుగలడందు లేడను చందాన సాగిపోతూ

భయభ్రాంతులతో పరుగులు పెట్టిస్తున్న కరోనా..!

నీ పని పట్టడానికే అహర్నిశలు

తమ మేధోమథనంతో వైద్యదేవుళ్ళు

విరుగుడు మందుగా వ్యాక్సిన్ ను

వెలుగులోకి తెచ్చి,

అలమటించే ప్రాణాలకు ఊరటనిచ్చారు

ప్రేమగా కబుర్లు చెప్పాలన్న

సరదాగా ప్రేయసి ని ముద్దాడాలన్నా

మాస్క్ లతో మస్త్ ఇబ్బంది పడ్డ

ప్రేమికులకు సాంత్వన చేకూరునని

బంధాలు అనుబంధాలు పెనవేసుకునే

రోజు దగ్గరలోనే వుందని

అంతవరకు సామాజిక దూరం పాటిస్తూ

వ్యక్తిగత శుభ్రత తో విడివిడిగా వుంటూ

కలివిడిగా పోరాడుదాం 

కరోనాను ఖతం చేద్దాం


Rate this content
Log in

Similar telugu poem from Abstract