మామిడి తోరణాలు
మామిడి తోరణాలు
శీర్షిక: మామిడి తోరణాలు
**************""""
పండగొస్తే చాలు
ఇల్లు కూడా
పచ్చని తోరణాలతో
సుందర సుమనోహర
ముగ్ధ లా ముస్తాబై
నయనానందకరంగా నిలుస్తుంది
ఆకుపచ్చని వలువలతో
నవవధువు గా మారి
వచ్చీపోయే వారిని
మృదువుగా స్పృశిస్తూ
ప్రాణవాయువును అందిస్తూ
శిరస్సును నిమిరి
పచ్చగా వుండమని దీవిస్తూ
చూపరులను ఆకర్షిస్తూ
ఇతరులకు మంచే చేయమంటూ
తరువు త్యాగాన్ని గుర్తు చేస్తూ
ప్రధాన ద్వారానికి పీఠికలా
ఠీవిగా నిలబడి తన
నిండు మనసును చాటుకునే
మామిడి తోరణాలు
శుభసూచికలు
