STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Inspirational Others

మా నిర్మాణ సంస్థలో కార్మికులోయ

మా నిర్మాణ సంస్థలో కార్మికులోయ

1 min
410

అరుగో..! అరుగో..! 

అరుగరుగో.. మా నిర్మాణ సంస్థలో కార్మికులు!!

పొద్దు పొడవంగానే తట్టా, బుట్టా సేతబట్టి బయలుదేరతారు!

యుధ్ధానికి సిద్ధమైన ఈరుల్లాగా.. ఏదైనా సేయగలమనే ధీరుల్లాగా ..


కాయ కట్టం తెలిసిన శ్రమజీవులోయ్!

మాయ మర్మం ఎరుగని కర్షకులోయ్!!

దాహమేత్తే గొంతు తడపుకోడానికి గుక్కెడు వాన నీళ్లోయ్!

ఆకలిలేత్తే పొట్ట నింపుకోడానికి గుప్పెడు గంజి మెతుకులోయ్!!


పొద్దుకూగే ఒరకూ బట్టిన పని ని ఒదలబోరోయ్..!

సాలిసాలిన కూలితోనే జీవనాన్ని సాగిత్తారోయ్..!!

కరోనా కాటుకు అన్ని రంగాలు మూసుకుపోయినేల!

నిర్మాణ రంగాన్ని ముందుకు నడిపిన సమరయోధులోయ్!!


అడిగడిగో.. ఓ ముసలాయన! 

నెత్తికి తలపాగా సుట్టి ఆపైన తట్టేట్టి కంకర మోత్తుంటే..


అదిగదిగో.. ఓ కన్నతల్లి! 

సంకకు గుడ్డ కట్టి అందులో తన బిడ్డని సుట్టి ఇటుకలెత్తుతుంటే..


అడిగడిగో... ఓ పిల్లాడు! 

పలకా బలపం బట్టాల్సిన సిట్టి సేతుల్తో పలుగు పార బడుతుంటే..


ఆల్లనాపే సెత్తి నాకు లేకబోయే, అడ్డుకునే దారి దొరకకబోయే.

ఆళ్ల కే సాయం నే సేయకబోతిని, నిస్సాహాయతగా నే మిగిలిబోతిని


అందుకే, 

నా మనసు సలించిబోతుంది, 

ఆవేదనలా ఉప్పొంగిబోతుంది, 

ఉండబట్టలేకబోతిని!

గమ్మునుండలేకబోతిని!!


కనీసం, ఆళ్ళ కట్టాన్ని పది మందికీ సెప్పాలనుంది.

ఆళ్ళ రోజూఆరీ దినసర్యను ఈ లోకానికి సాటాలనుంది.


అందుకే, 

నా ఆలోసనలతో కలం సేతబడితిని, 

ఆ ఆవేదనను కాగితంపై పెడితిని


నా రచనలలో మా నిర్మాణ సంస్థలో కార్మికుల కట్టానికి ప్రతిఫలంగా ఈ కవితా పురస్కారాన్ని నా మది పుస్తకంలో లిఖించగలిగితిని.


రచన: సత్య పవన్ ✍️✍️✍️







Rate this content
Log in

Similar telugu poem from Abstract