మా ఇ౦టి దీప౦
మా ఇ౦టి దీప౦


అసూయ ఎరగని మనసు తనది
ఆప్యాయతకు అద్దం లాంటి హృదయం తనది
ఇంటి నిండా వెలుగులు నింపే ధైర్యం తనది
ఈర్ష్య అహంకారాలనే చెడును దరికి రానివ్వని స్వచ్ఛత తనది
ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పిల్లలకి పంచే చిలిపితనం తనది
ఊయలలు ఊపే అనురాగం తనది
పరిచయం అవసరమే లేని ఈ మనిషిని గుర్తించారా???
-శ్రీ గౌరీ