STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama Romance

4.8  

Ramesh Babu Kommineni

Drama Romance

లెక్క

లెక్క

1 min
326


ప౹౹

లేఖ ఒకటి రాశాగా లేదులే సంశయం

లెక్క ఒకటి తేల్చాలన్నదే ఆ ఆశయం ౹2౹


చ౹౹

ప్రేముందోలేదో చెప్పాల్సిన సమయం

భామ ఇపుడు చేయకా కాలవ్యయం ౹2౹

తిలకాష్టమహిషబంధం కాదే ప్రేమంటే

తీరికలో ఆడే ఆట కాదుగా మాటంటే ౹ప౹


చ౹౹

ఆశ పెరిగి అదనులో ప్రేమనే కోరింది

శ్వాస ప్రతి క్షణమే కూరిమినే వేడింది ౹2౹

వలపుల వాలకమూ గమనించలేదా

తలపుల తన్మయము ఆవరించలేదా ౹ప౹


చ౹౹

ఎదురు చూసిన ఎదకు ప్రతిఫలమేది

ఏదారో తెలియక లేదులే ఏ కలయేది ౹2౹

తక్షణమే తరలివచ్చి తేల్చవా ఆ లెక్క

ఈ క్షణమే బదులుకై రాస్తున్నా ఓ లేఖ ౹ప౹



Rate this content
Log in