STORYMIRROR

Ramesh Babu Kommineni

Drama Romance

4.8  

Ramesh Babu Kommineni

Drama Romance

లేఖనీయం

లేఖనీయం

1 min
312


ప౹౹

కావాలనే రాస్తున్నా వలచే వసంతాన్ని

కవులనే కావాలని మెచ్చి ఆసాంతాన్ని ౹2౹


చ౹౹

వలపు కోయిలా వాకిళ్ళనే తెరవాలని

అలపు మరచి ఆలాపన సాగించాలని ౹2౹

మదిలో తలపుమైకం తన్మయించాలని

నదిలా గమ్యం కోసమే ప్రవహించాలని ౹ప౹


చ౹౹

లేకలేక రాసిన లేఖైన ఇది లేఖనీయమే

రాలేక రాసి పంపినా అభినందనీయమే ౹2౹

ఆనవాలునే అందించాలని నే ఆశించగ

చేవ్రాలునే చేమంతులుగా నిర్వచించగ ౹ప౹


చ౹౹

ఉంచుకో ఉత్తరాన్ని జ్జాపకాల పేటికలో

దాచుకో వాత్సల్యాన్నీ ఎలమివాటికలో ౹2౹

పదిల పరచుకో పరువాన్నీ పదికాలాలు

హృదిలో పొంగనీ ఆ ముసిమి మేళాలు ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Drama