Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Abstract Action Inspirational

4.5  

jayanth kaweeshwar

Abstract Action Inspirational

లౌకిక మత రాజ్యం - వచన కవితా సౌరభం : కవీశ్వర్

లౌకిక మత రాజ్యం - వచన కవితా సౌరభం : కవీశ్వర్

1 min
155


లౌకిక మత రాజ్యం :  25. 07. 2021 : kaweeshwar 

అంశం :మత సామరస్యం : శీర్షిక : లౌకిక మత రాజ్యం  

రచన :వచన కవితా సౌరభం  


మన రాజ్యాంగ కర్తలు, పెద్దలుమహోన్నతం గా నుడివిరి .

 మన రాజ్యము మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యమని 

అందరి వేల్పు ఒక్కడే అనిన దేశములో కలహములేల ?

మనదేశములో ఎన్నియో తార్కాణములు కలవు అని 


మచ్చు తునకలు : వేములవాడ రాజన్న సన్నిధి లో గల దర్గా : 

దేవునికడపలో బిబి నాంచారమ్మ వెంకన్నను చేపట్టి తరియించె కదా !

భాగమతి  ఖులీ తుబ్ షాహ్ ని వరియించె కదా !

గాయకుల నోట మతసామరస్య పాటలు ప్రసిద్ధి గాంచె కదా !

 

దేవుడు ఒకడే ఆ దైవం ఒకటే అల్లా అని పిలిచినా …. 

ఘంటసాల , మొహ్మద్ రఫీ, సుశీల లతా మంగేష్కర్ లాంటి

 గాయనీ గాయకుల నోట మతసామరస్య పాటలు 

ఎంతో రమణీయం : సినారె , ఆనంద్ బక్షి మొదలగు

 గీత రచయితల కమనీయ రచనల జనాదరణ రంజకం 


కలహాలెందుకు - పరమత సహనం లేనందుకే కదా !

ఎవరి ధర్మాన్ని వారనుసరిస్తే ఒండొరులకు కినుకలెందుకు ? 

దేశ పురోగతి - ఐకమత్య , సహాయ- సహకారాల పైనే కలదని ఎందుకు ఆలోచించరు? 


కులాంతర , మతాంతర వివాహాల ప్రస్తావనలో కలహాలెందుకో ?

 సంయమనం ఎందుకు పాటింపరో?

భారతదేశం నా మాతృ భూమి - భారతీయులందరు 

సోదర సోదరీమణులు అన్నప్పుడు - ఎందుకు కలతలు- కొట్లాటలు ?


అలౌకిక విషయాలపైన లౌకికవాదులు చర్చించకుంటే 

అరిషడ్వార్గాలను మన కంట్రోల్ లో ఉంచుకుంటే 

దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ పాటుపడితే , అభివృద్ధిలో భాగమైతే 

మతసామరస్యానికి ఎలాంటి కీడు వాటిల్లదని నా అభిప్రాయం . 



Rate this content
Log in

Similar telugu poem from Abstract