కవితా పూరణం : "కృషీవలుని కష్టాల కడలి"
కవితా పూరణం : "కృషీవలుని కష్టాల కడలి"
కవితా పూరణం : "కృషీవలుని కష్టాల కడలి"
నస్త్యాక్షరి : కవీశ్వర్ : 20 .02 . 2022
దత్తపదిః- నింగి - నీరు - నిప్పు - గాలి -🌷
పూరణం : 💐
నింగి నంటు కృషీవలుని ఆశల పరిధి అంబుధిన్ గల .
నీరు మృగతృష్ణవలె రైతునూరించే జలమే రోహిణీకార్తె .
నిప్పుల కుంపటి తరిం సేద్యంబు సేయ గగనంబయ్యె .
గాలి వానతో నుత్పాదనసర్వం కలుషీకృతంబయ్యె నిలన్ ||
భావం : కృషీవలుని కష్టాల కడలిలో పంచభూతముల సహాయ నిరాకరణము
ఎంత తీక్షణముగా నున్నదో వివరించే ఈ కవితా పూరణం : ఆకాశాన్నంటే రైతు ఆశల
మేఘములోని నీరు మృగతృష్ణవలె రైతుని వర్షము పడుతుందా ? పడదా / అని ఊరించే
జలమే , రోహిణి కార్తె ఎండల నిప్పుల కుంపటి వలే వ్యవసాయము చేయ ఇక్కాలమునందు
కష్టముల కడలిలో పండించిన ఉత్పాదన గాలి-వానలతో పంచభూతముల సహాయ నిరాకారణం వల్ల కలుషితం అవుతున్నది అని ఈ దత్తపాదం యొక్క భావం .
వ్యాఖ్య : "కర్షకుల సమయానుకూల , సహాయము అందిన ప్రజలకు తన ఉత్పాదనను
అందించు ప్రయత్నమును సవ్యముగా చేయ వీలగును .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
