STORYMIRROR

ARJUNAIAH NARRA

Action Inspirational

4  

ARJUNAIAH NARRA

Action Inspirational

క్షమించు!నా జీవిత భాగస్వామి

క్షమించు!నా జీవిత భాగస్వామి

1 min
403

నీవు ప్రొద్దునే లేచింది మొదలు

పిల్లలకు నాకు తలంటు పోసేసి

కిచన్ లో మిషనుగా పనిచేస్తూ

వంటలు చేసి టిఫిన్స్ వడ్డిస్తు 

నీవు పడుతున్న శ్రమలో

నేను నీ భాగస్వామిగా భాగసౌమ్యం 

పంచుకోనందుకు నన్ను క్షమించు.......!

 

స్కూల్ కి, ఆఫీసుకు పంపేందుకు

పిల్లలకు, నాకు ఉత్సాహం నింపుతు

యూనిఫామ్స్, బ్యాగులు సర్దుతూ

మరియు మా ఆకలి బాధను 

తీర్చేందుకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ లు

పెట్టేటప్పుడు నీవు చేస్తున్న పనిలో

నేను నీ భాగస్వామిగా భాగసౌమ్యం 

పంచుకోనందుకు నన్ను క్షమించు.......!!


సాయంత్రం తిరిగి వచ్చిన 

మా బరువులను ఇంట్లోకి 

మోసుకుపోయి పెట్టేసి

స్నాక్స్ లు, కాఫీలు, ఇచ్చి 

అలసి పోయిన మాకు శక్తినిచ్చె

పనిలో నేను నీ భాగస్వామిగా 

భాగసౌమ్యం పంచుకోనందుకు

నన్ను క్షమించు.......!!!


నేను సుదూరంలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడు

నా తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని కాపాడవు

నీవు కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడవు

నా భాగస్వామిగా నా కష్టాలను పంచుకోని 

నా గౌరవాన్ని నిలబెట్టిన 

నిన్ను గుర్తించనందుకు

నన్ను క్షమించు.......!


నేను పెట్టిన టార్చర్ ను భరించావు

నా కుటుంబం పెట్టిన బాధలు సహించావు

పురిటి నొప్పులను పంటి బిగువునా పట్టేసి 

నా వంశ అభివృధ్ధికోసం నీ కడుపును కోసేసుకొని 

మా ముఖాన చిరునవ్వులు పూయించావు


నన్ను కరోన అవహించినపుడు

నీవు చావుకు ఎదురు తిరిగి

నన్ను అంటిపెట్టుకొని నీవు 

నాకు సేవ చేసి ప్రాణం పోసి

మళ్ళీ మాములు మనిషిని చేశావు....

ఇపుడు వృద్దాప్యం మీద పడ్డప్పుడు.....

నా ఆలోచలన్ని నీ వైపే తిరిగినాయి


ఎక్కడో పుట్టి మా ఇంటికోచ్చి..

చెల్లిగా చెలిమిని, అక్కగా ఆప్యాతలను పంచావు

కోడలిగా కష్టాలను, భార్యగా బాధలను భరించావు

నేను మీ అమ్మలా నిన్ను ప్రేమించకున్న

నన్ను మా అమ్మలా నన్ను ప్రేమించావు

నేను మీ నాన్నలా నిన్ను చూడకున్న

నన్ను మా నాన్నలా నన్ను కాపాడావు

అన్ని నీవయ్యావు.....ఎన్నో త్యాగాలు చేశావు


నీతో ఏడడుగులు వేశాను

ప్రతి అడుగుకు ఒక ప్రమాణం చేసాను

నా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించు.......!!

ఉండే ఉంటాయిలే......

నన్ను నేను క్షమించుకోలేని తప్పు చేసే ఉంటాను


నేను సగటు మనిషినే కదా?

నిన్ను ఇబ్బంది పెట్టె ఉంటాను

ఆవేశం హద్దులు దాటినపుడు

కోపం కోరలు చాపినపుడు

అహం కళ్ళను అలుముకున్నప్పుడు

నేను చేయి చేసుకునే ఉంటాను

నేను నీ భాగస్వామిగా సహనం కోల్పోయినందుకు 

నన్ను క్షమించు....!!!


ఓ సద్గుణ వతి.....ఓ సహన శీలి

నన్ను క్షమించు......!

ఓ శాంతి దూత...ఓ కరుణా మూర్తి

నన్ను క్షమించు....!!

ఓ ప్రేమాస్వరూపిణి....ఓ అనురాగా దేవత

నన్ను క్షమించు......!!!

ఓ నా జీవిత భాగస్వామి ....

నన్ను క్షమించు.....!

నన్ను క్షమించు.....!!

నన్ను క్షమించు.....!!!


Rate this content
Log in

Similar telugu poem from Action