కర్టెన్ వెనుక..
కర్టెన్ వెనుక..
మత్తుగా నిద్రపోతున్నాను
నువ్వు లేకుండా నిద్రపట్టదు అనుకున్నానా
ఎక్కువ ఏడుస్తున్నా అని
ఏవో తెల్ల మాత్రలు ఇచ్చారు
అప్పటినుంచీ మగతలో ఉన్నా
రోజుకో పేరు మార్చుకుంటున్న ఆ రోగం
నిన్నట్టే తీసుకెళ్ళింది కానీ
నా చెయ్యి మీద పచ్చను ఏం చేయలేకపోయింది
ఇప్పుడిప్పుడే ప్రపంచం ఏందో తెలుస్తోంది
బలవంతంగా తినాలి
బతకాలి
ఎవ్వురూ లేనప్పుడు
కర్టెన్ వెనుక పాత మంచం మీద కూర్చుని
నీకు ఏవేవో చెబుతూ ఉన్నా
దడక్కన ఎవురాన్నా వస్తే
కర్టెన్ మూసేయొచ్చు
కళ్ళలో నిద్ర ఇంకా ఉంది
పుసులు కట్టిన కళ్ళలో
నీతో బ్రతకాలనే ఆశలు ఉండిపొయినాయి..