Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

murali sudha

Abstract

4  

murali sudha

Abstract

చీకటి గది

చీకటి గది

1 min
474


చీకటి గది.....


ఆ నాలుగు గోడల గదిలోనే

తలదాచుకోవడం మేలనిపిస్తుంది ఒక్కోసారి

జాలి మంటల్లో కాగిన ఒళ్ళు

102 డిగ్రీల టెంపరేచర్ ని చూపించినా

లోపల మాత్రం ఒకటే ప్రేమ చలి


కావాల్సిన వాళ్ళు ఒకరిద్దరన్నా 

నుదుటిన చిన్నగా చేయి వేస్తే బాగుండు

నిద్ర పోయీ పోయీ అలసిన కనులు

కాస్త మెరగ్గా తెరుచుకుంటాయి

వస్తూ పోతూ ఏ స్వరమో 

పలకరిస్తేనే మేలు

అలజడుల వినికిడులు విన్న గుండె

కొత్త శబ్దాల అవలోకనంతో తెరిపిన పడుతుంది


సూది మందులు అక్కరలేదు ఇప్పుడు

గుచ్చి గుచ్చి ప్రశ్నించే చూపులు దూరమైతే చాలు

అత్యంత ఖరీదైన మందుబిళ్ళల పనిలేదు అస్సలు

ఊరటనిచ్చే మాటల గంజి దొరికడమే పదివేలు


ఈ భయాత్పాతాలు 

ఈ భీతావహ కెరటాలు

ఆగిన నేలపై

కొన్ని కోసుల దూరం నడవాలని ఉంది

ఏ మాసిన స్పర్శలూ

ఏ ముసిరిన వీడ్కోళ్ళూ

కనపడని చోటున

స్వేచ్ఛా గాలి పీల్చాలని ఉంది


ఒంటరిగా కాదు సుమా...

మందిలో మందలో ఒకదానిగా......


సుధామురళి

   


Rate this content
Log in