STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance

4  

Dinakar Reddy

Abstract Romance

నా పరిచయం

నా పరిచయం

1 min
314

నిన్ను కలిశాక తెలిసింది 

నేనంటే ఏమిటో

నాకున్న విలువేమిటో


మనసు కుదుటపడిన వేళ

అన్నీ మంచి ఆలోచనలే

అవన్నీ నిజం కావాలని

ఆ దేవుణ్ణి అడుగుతున్నాను

నువ్వూ నేనూ కలిసే ఉండాలని

ప్రతి ముద్దులో నిన్నే అడుగుతున్నాను


ఇంత చేరువగా వచ్చాక

ఇంకా సందేహాలెందుకు అంటావ్ నువ్వు

ఏమో

ఈ మనసెంత చిత్రమైనది కదా

అన్నీ అనుకున్నది అనుకున్నట్లు జరిగినా

ఆదుర్దా పడక మానదు


ఏనాడూ నువ్వు నన్ను విడకూడదని

ప్రార్థించకుండా మరువదు.


Rate this content
Log in

Similar telugu poem from Abstract