STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

అర్థం పరమార్థం

అర్థం పరమార్థం

1 min
546

మట్టి మనుషులమని

ఏనాటికైనా మట్టిలోనే కలిసేదని

బాహ్యసౌందర్యం శాశ్వతం కాదని

క్షణభంగురమే జీవితమని

దేహం మట్టిరేణువుల సముదాయమని

వున్న నాలుగు నాళ్ళయినా

తరువు వోలె తరించాలని

సృష్టి కర్త చేతిలో మలిచిన బొమ్మలం

చేజారితే పగిలి ముక్కలవునని

ప్రాణం కన్నా పేరు ముఖ్యమని

కాయం పోయినా కీర్తి మిగలాలని

స్వార్థం వీడి సేవా తత్పరత వున్నవాడే

మనిషి మహనీయుడవుతాడని

దేహాన్ని వీడేదాక మనిషికి మట్టికి

అవినాభావ సంబంధం ఉన్నదంటూ

చెప్పకనే చెబుతోంది సారాంశం

దేవుడిచ్చిన గొప్ప వరం జీవితం

మధ్యలోనే తుంచే హక్కు ఎవరికీ లేదు

ఆఖరి శ్వాస వరకు ఆస్వాదించడమే

మట్టిలో కలిసేదాకా

మనుగడ సాగించడమే

అర్థం పరమార్థం


Rate this content
Log in

Similar telugu poem from Abstract