STORYMIRROR

murali sudha

Abstract Inspirational

4  

murali sudha

Abstract Inspirational

ఇదే సరైనది

ఇదే సరైనది

1 min
348


కూయనీకు ఏ ఆవేశాన్ని కొక్కోరోక్కో అని

అక్కడ కొన్ని అహాలు మేల్కొంటాయ్


వెలగనీకు ఏ నిజాన్ని నిబ్బరత్వపు ప్రమిదన

అక్కడ కొన్ని జీవితాలు మూతబడతాయ్


విసరకు ఏ నిర్భయత్వపు పంజాని

దగాకోరు గుండెలక్కడ బిక్కచచ్చిపోతాయ్


విరగనీకు ఏ ముక్కుసూటి మాటల విల్లుని

నక్క వినయపు నయవంచనలక్కడ పెళ్లుమంటాయ్


పారనీకు ఎర్రబడ్డ కళ్ళ నుండి అగ్నిధారలని

తప్పుల తడికెలక్కడ నిలువునా కాలిపోతాయ్


ఎదిరించే నీ ధైర్యం ముందు

కాలనాగుల విషాలు విరుగుడికి లోనౌతాయ్


దుమికే నీ నిశ్చల ఆలోచనల అలలలో

పాపిష్టి బతుకులు కొన్ని కొట్టుకుపోతాయ్


మారతావేమో....

వీటిని చూసి.....


వద్దు ....నువ్వలానే ఉండు...


వంద మేకల్ని తిన్న బెబ్బులీ నీ తెగువ చూసి బెదరాలి

వేల పిట్టల్ని కాజేసిన రాబందూ నీధాటికి విలవిలలాడాలి

సమస్తాన్ని చుట్టేసే సునామీ నీ కంటి చూపుతో వెనక్కి తగ్గాలి


ఇదే కరెక్ట్.... పద్ధతి....

అన్యాయాన్ని అణచేందుకు...

అధర్మాన్ని తొక్కేసేందుకు..


సుధామురళి


Rate this content
Log in

Similar telugu poem from Abstract