STORYMIRROR

Dinakar Reddy

Abstract Romance Fantasy

4  

Dinakar Reddy

Abstract Romance Fantasy

నా ఊహకు ఆధారం

నా ఊహకు ఆధారం

1 min
532

కలవో 

మరో లోకపు ప్రేయసివో

నాలోని కళను మేల్కొలిపి

నన్ను జాగృతం చేసిన దేవతవో


నిన్ను ఏమని వర్ణించను

అల క్షీరసాగర మథనంలో జనియించిన కాంతి రేఖవనా

వసంత కాంత కట్టిన ఆకుపచ్చని చీరవనా

మెళకువలు నేర్చిన నూతన కోరికవనా


ఏమో

నువ్వు ఏమైనా

అది మాయే అయినా

నా ఊహకు ఆధారం నువ్వు

నే విహరించు గగనతలంలో దాగిన రహస్యానివి నువ్వు


అందుకే అర్థిస్తున్నా

నన్ను వీడిపోకు

వేవేల శృంగార కావ్యాల సారం నాలో ఉప్పొంగనీ

నూతన మధుర కావ్యాలను నా కలం లిఖించనీ


Rate this content
Log in

Similar telugu poem from Abstract