STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Others

"నీతో చెప్పాలని..!"

"నీతో చెప్పాలని..!"

1 min
502

"నీ సొగసుల సౌందర్యం మాయమైన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ నయనపు ఎదురుచూపులు!

నీ పలుకుల సవ్వడి మూగబోయిన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ నిరంతరపు ఆలోచనలు!

నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ...

ఎందుకాగాలేదో, నీకై నా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు!

నీ అడుగుల కదలిక దూరమైన వేళ...

ఎందుకాగలేదో, నీకై నా ఈ హృదయపు స్పందనలు!"

ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మద్దతిస్తూ జై కొడుతుంది.

ఇక బయట పడవా అంటూ నా బుద్ధి నన్ను వెక్కిరిస్తూ ఛీ కొడుతుంది.

ఎవరి మాటని వినను? ఎవరికని నచ్చజెప్పను?

నువ్వే చెప్పు, ఓ ప్రియ నేస్తం!

దూరమైనా, చేరువైనా నా తీరపు అల నువ్వని,

బరువైనా, బాధ్యతైనా నా ఊహల పల్లకి నువ్వని,

భారమైనా, బంధమైనా నా హృదయపు తీగ నువ్వని,

స్వప్నమైనా, నిజమైనా నా వేకువ పొద్దు నువ్వని

వాటికీ... నీకు... తెలీదా?

చివరిగా, నీతో చెప్పాలనుంది...

నువు దూరమైనా...

ఎన్నాళ్లగానో నీకై నా ఈ మనోవేదన?

ఎనాల్లైనా తప్పదుగా నీకై నా ఈ నిరీక్షణ!

నీకై తపించే...

కాదు కాదు,

నీ ప్రేమకై నిరంతరం శ్రమించే

-ఓ ప్రేమ పిపాసి



Rate this content
Log in

Similar telugu poem from Abstract