ఆ....దృశ్యం
ఆ....దృశ్యం
ఆ.....దృశ్యం....
దేహమిప్పుడు విచ్చుకత్తుల సమూహం
కూలిపోవడమే
రక్తాలు ధారలు కడుతూ
లేవడం....నిలదిక్కుకోవడం
కలల్లోనూ కలగనలేం
ఏమాటా పెగలకూడదు
అసలు ఏ మౌనం బైటపడకూడదు
నుసి నుసిగా నువ్వు రాలిపోవాలి
బూడిద కుప్పలా కూడా మిగలకుండా
దొరకని గాలిలో ధూళిలా రేగిపోవాలి
శరాఘాతాల సాంగత్యం నీకు కొత్తగా అనిపించకూడదు
కృష్ణబిలాలూ
ఉల్కాపాతాలూ
ఏవీ పెను ప్రమాదాలుగా నువ్వు భావించకూడదు
నిన్ను నువ్వే శత్రువును చేసుకుంటూ
నీ గుండెనే నీకో రణక్షేత్రంగా మార్చేసుకుంటూ
నువ్వున్నావో లేవో అనే సంశయాన్ని
నీలో నువ్వే అప్పచెప్పేసుకుంటూ
ఇన్ని టూల మధ్యన
తోక తెగిన తోకచుక్కలా కూలిపోవాలి
నివాళి దొరకని ప్రదేశంలో
మృత్యు జావళి పాడుకుంటూ
అదృశ్యమైపోవాలి
ఆ....దృశ్యమ్
ఇక్కడ అదృశ్యమైపోవాలి.....
