STORYMIRROR

murali sudha

Abstract Inspirational

4  

murali sudha

Abstract Inspirational

బతికేద్దాం

బతికేద్దాం

1 min
391


##మన బతుకిది....!!!


అవునవును ఇప్పుడదే అవసరం

పద పద ఏమూలన దాగుందో వెతికి పట్టుకొద్దాం

ఏ నిషాలో మునిగుందో కాస్త చురుక్కు తగిలిద్దాం


వాడేవడో ఏదో వెక్కిరింత గంధాన్ని పులిమాడట

వీడేదో తాడుకి మెడనిచ్చి ఊరేగుతున్నాడు

ఇంకెవడో పనికిరాని మాటల్లో ముంచి లేపాడట

ఈడేమో ఆ మండే ద్రావకంతో ఒళ్ళు తడుపుకున్నాడు

ఇంకోడికొచ్చిన డబ్బు జబ్బుతో వీడి వాలకాన్ని తప్పు పట్టాడట

మనోడు మంచినీళ్ల బావిలో తలదాచుకున్నాడు


ఇప్పుడా వీడికీ

ఇంకా వాడికీ అవసరం కదూ

ఆత్మస్తైర్యం.... నిలదొక్కుకోడానికో

నిఖార్సుగా ఎదిగి చూపించడానికో


ఎవడిక్కడ తోపు

ఎవడికుండే గుండే వాడి బలుపు

రోగం వచ్చిందనో 

భోగం పోయిందనో

అవ్వ తిట్టిందనో

బువ్వ దూరమైనదనో

వదిలేసే ప్రాణాలంటోయ్ మనవి

ఉమ్మనీటిలో ఈది

వేలెడంత సందులోంచి తలదూర్చి

అమ్మ జన్మను ఇరుకున పెట్టి

భూమి మీద పడ్డ అదృష్టవంతులం మనం


బతికేద్దాం..... 

సిగ్గూ ఎగ్గులలో చితకక

మానావమానాల్లో నిశ్వాసను బలిచేయక

బతికేద్దాం....

భూమిపై రూకలు ఉన్నంత వరకూ బతికేద్దాం...

ఆత్మ స్టైర్యానికి కేరాఫ్ అడ్రస్ గా బతికేద్దాం....


సుధామురళి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract