Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kadambari Srinivasarao

Abstract

4.5  

Kadambari Srinivasarao

Abstract

గగనతలం

గగనతలం

1 min
194


అదొక అద్భుత విన్యాసాల చెట్టు

అక్కడ రేయి వెలుగుపూలు

వేలాడుతూ.. 

కోయలేనంత దూరాన 

అరవిరిసి అలరిస్తాయి

ఆ చెట్టు అంతటికీ 

ఒకే ఒక్క వెండి పండు

వెలుగు పూల మధ్య చల్లని వెలుగులతో 

కనువిందు చేస్తుంది

ఆ పండు కావాలని పిల్లలందరూ

అమ్మ దగ్గర మారాం చేస్తారు

వాళ్ళను బుజ్జగించి జోకొట్టి

కనుల కిటికీలు మూసేసరికి

చెట్టు మీద కోటి వెలుగుల పువ్వు పూసి

రేయి పువ్వులను పక్కకు నెట్టేసి

తన అజమాయిషీ బాణాలను

పుడమి అంతా సంధించేస్తుంది 

ఆ చెట్టుకున్న ఇంకో గొప్ప లక్షణం

తానుగా పంచే గాలులు..

అవి ఎంతటి బలమైనవైనా..

జీవకోటి మొత్తం వాటి ధాటికి వణికినా..

తాను మాత్రం ఇసుమంత కూడా కదలదు!

ఆ చెట్టు చేసే అపర విన్యాసాలు

లిక్కించ సాధ్యమా?!

అందుకే అంటాను 

అదొక అద్భుతమైన చెట్టు అని!!



Rate this content
Log in

Similar telugu poem from Abstract