కరోనా తో పోరాడుదాం
కరోనా తో పోరాడుదాం
పెద్దలు అంటారు వైద్యో నారాయణో హరిః వారే లేకుంటే ఎన్నో ప్రాణాలు అనేవి హరీ
వారి పాత్ర అమోఘం నేటి జాతీయ విపత్తులో సహాయంగా వారికి ఎన్ని శాఖల
ఉద్యోగులో శ్రమ పడుతున్నారు వారు రాత్రి పగలు అనక చేష్టలుడిగి ఉన్నాం
మనం ఏమీ చేయలేక చేయగలిగేది మనని మనం కాపాడుకోవడమే
ప్రభుత్వాలు మనని కోరేది ఆ మాత్రం సహాయమే ఎవరికీ ఏదీ చేయలేని మనం
ఆ మాత్రం చేద్దాం స్వీయ నియంత్రణతో కరోనా తో పోరాడుదాం కనిపించకుండా చేస్తోంది అది మాయా యుద్ధం బైటికి రాకుండా మనమూ చేద్దాం
ప్రచ్ఛన్నయుద్ధం మనవెంట ఆ మహమ్మారి పడగలదు ఎంతకాలం ఉష్ణోగ్రత
ప్రభావము పెరిగి వచ్చే వరకు ఎండాకాలం మండుటెండల్లో పని చేయదు ఏమాత్రం
దాని బలం తరిమి కొట్టినప్పుడు తెలుస్తుంది మన ఐక్యతా బలం రారండి
అందరం కలిసి ఐకమత్యంతో పోరాడుదాం మహమ్మారి కరోనా వైరస్ ను సమూల నాశనం చేద్దాం.