కరోనా (prompt 12)
కరోనా (prompt 12)


కరోనా పీడిత ప్రాంతాలను ప్రభుత్వం మూడు రకాలుగా విభజించింది
ప్రమాదకరమైన ప్రాంతాలను ప్రజల సౌలభ్యం కోసం రెడ్ జోన్ లని ప్రకటించింది
తక్కువ స్థాయి ప్రమాద వీచికలు గల ప్రాంతాలకు ఆరెంజ్ జోన్ లని పేరిడింది
ప్రమాదం అతి తక్కువ స్థాయి గల ప్రదేశాలకు ఆకుపచ్చ జోన్ లుగా ధృవీకరించింది
కరోనా కి, ధన్వంతరి తో సమాన మైన మన వైద్యుల గురించి తెలియదు
అవసరానికి ఏకమై ఐకమత్య ప్రతాపాన్ని చూపే మన సంగతి తెలియదు
కరోనా కి, తాను మాడి మసి కాబోయే రోజు దగ్గర పడుతోందని తెలియదు
ఆ సంగతి గ్రహించినంతనే, దానంతట అదే తోక ముడిచి పారి పోగలదు
ఎందుకంటే దాని సర్వ నాశనానికి వైద్య శిఖామణులు రంగం సిద్ధం చేస్తున్నారు
ప్రజలంతా మునుపటి లాగా మామూలు గా, స్వేచ్ఛ గా తిరగ గలరు
కరోనా వలన నేర్చుకున్న స్వచ్ఛత శుభ్రతలను ప్రజలు ఎప్పుడూ పాటించాలి
మళ్ళీ ఇంకే వైరస్ పట్టి పీడించే అవకాశం లేకుండా ప్రజలే జాగ్రత్త పడాలి