STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

కరోనా కాలంలో

కరోనా కాలంలో

1 min
383

నిర్మానుష్యమైన రోడ్లు

పోలీసు వాహనాల సైరెన్లు

ముఖాన్ని కప్పిన మాస్కులు

శానిటైజర్ తో తడిసిన చేతులు


కొత్తవాళ్లు దగ్గరికి వస్తున్నా భయం

పాతవాళ్లు దూరం వెళ్తున్నా భయం

పల్స్ ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొత్త మార్కెట్

కరోనా పరీక్షలు శిరోధార్యం


నిద్రలేని రాత్రులు సాధారణం

కాపాడుతూ మరణిస్తున్న వైద్య,పారిశుధ్య సిబ్బంది

ఇంట్లో ఉండి బతకలేక

బయట తిండి దొరక్క

హాస్పిటల్లో బెడ్ లేక

ఎన్నో ప్రాణాలు

లెక్కలేని మరణాలు

పోతున్న ఉద్యోగాలు

వస్తున్న కొత్త ప్రమాదాలు

వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్లు


పెళ్లిళ్ల హడావిడి తక్కువ

చావింటికి వెళ్లడమూ భయమే

అక్కడో శవం

ఇక్కడో జీవం

పరిసరాలు జనస్మశానం


వ్యాక్సిన్ వార్తల కోసం చెవుల రిక్కింపు

ఫోన్లోనే ఓదార్పు

కొత్త రేపటి కోసు చావని ఆశల తలపు

కరోనా కాలపు కన్నీటి మేల్కొలుపు


Rate this content
Log in

Similar telugu poem from Abstract